స్కామ్తో నాకు సంబంధం లేదు. స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

స్కామ్తో నాకు సంబంధం లేదు.  స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన  చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ముందు స్వయంగా  తన వాదనాలను  వినిపించారు.  ఏసీబీ కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలన్న చంద్రబాబు  కోరగా న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.   ఈ స్కామ్ తో తనకు సంబంధం లేదని, తనని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ  తెలిపారు. రాజకీయ కక్షతోనే తనను  అరెస్టు చేశారని పేర్కొన్నారు. నిన్న ఉదయం 05 : 40 నిమిషాలకు నోటీసులిచ్చి..  ఇవాళ రిమాండ్ రిపోర్టు ఇచ్చారని బాబు తన వాదనలు వినిపించారు.  

వాదనలు అయిపోయాక మీరు  కోర్టులోనే ఉంటారా లేదా అని జడ్జి అడగగా, వాదోపవాదనలు పూర్తి అయ్యేవరకు కోర్టు హాలులోనే ఉంటానని బాబు బదులిచ్చారు.  చంద్రబాబు తరుపున లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.  కాగా ఈ కేసులో చంద్రబాబును 15 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ కు ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీఐడి కోరింది.