ఉల్లిగడ్డకు.. ఆలుగడ్డకు తేడా తెలియని జగన్​​ : చంద్రబాబు

ఉల్లిగడ్డకు.. ఆలుగడ్డకు తేడా తెలియని జగన్​​ : చంద్రబాబు

ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రత్యర్ధులను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు..ఎన్నికల ప్రచారాన్ని  మొదలుపెట్టాయి. .  వైసీపీ అధ్యక్షుడు జగన్ పై విరుచుకుపడ్డారు  టీడీపీ అధినేత చంద్రబాబు.   అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనకు డెడ్ లైన్ మొదలైందని..ప్రజాక్షేత్రంలో జగన్ కు శిక్షపడే సమయం దగ్గర పడిందని మండిపడ్డారు. జనం రక్తం పీల్చే జలగలు మనకు ఎందుకంటూ విమర్శించారు. ఉరవకొండ  ప్రజలు చేసే జనగర్జన రాష్ట్రమంతా వినిపించాలని గట్టిగా కోరారు. 

టీడీపీ ప్రభుత్వంలో తాము 10 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను తీసుకువస్తే, దాన్ని ఈ ముఖ్యమంత్రి పక్కనబెట్టేశాడని మండిపడ్డారు. 30 కోట్లరూపాయిలసామాగ్రిని  సామగ్రిని తుప్పు పట్టించాడని ఆరోపించారు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. ఇక వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు.  టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక రైతులకు మళ్లీ పాత బీమా సదుపాయం తీసుకువస్తాం. రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తాం అని చంద్రబాబు వెల్లడించారు

ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా కనిపిస్తోందని అన్నారు. నిన్నటిదాకా ఒక మాట మాట్లాడిన జగన్... ఇప్పుడు హ్యాపీగా దిగిపోతా అంటున్నాడని వివరించారు. దిగిపోవడం కాదు... దించుతారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. నువ్వు చేసిన పనులకు, నువ్వు పెట్టిన ఇబ్బందులకు నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరపడ్డాయి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.