చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అక్టోబర్ 31న తీర్పు.. ఏ కేసులో అంటే...

 చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై  అక్టోబర్ 31న తీర్పు.. ఏ కేసులో అంటే...

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.  ఈ కేసులో వాదలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ మంగళవారం ( అక్టోబర్ 31) న  ఇస్తామని వెల్లడించిది.  అయితే ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సీఐడీ తరపు న్యాయవాదులు సమయం కావాలని  కోర్టును అభ్యర్థించారు.  

చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యతర బెయిల్ మంజూరు చేయాలని అధికారులను కోరుతూ పిటిషన్ వేశారు. హెల్త్ రిపోర్ట్‌లను అటాచ్ చేస్తూ కంటికి ఆపరేషన్ చేయాలంటూ మద్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి ఆపరేషన్‌ జరిగిందని రిపోర్ట్‌లు అటాచ్‌ చేశారు న్యాయవాదులు. కుడి కంటికి కూడా ఆపరేషన్‌ చేయాల్సి ఉందంటున్నారు బాబు లాయర్లు. చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పటికే మెమో వేసింది సీఐడీ.  ఇరు పక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును రేపటికి ( అక్టోబర్ 31)కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.  దీంతో చంద్రబాబు బయటకు వస్తారా.. లేదా అనే అంశంపై టీడీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.