
అమరావతి, వెలుగు: ఏపీలో మూడు ప్రధాన పార్టీల అధినేతలు తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన వార్షికాదాయం రూ.64 లక్షలుగా పేర్కొన్నారు. తన ఆస్తుల విలువ రూ. 28 కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. పలు బ్యాం కుల్లో రూ. 5 కోట్ల అప్పులు ఉన్నట్లు వివరిం చారు. తనపై ఒక క్రిమినల్ కేసు ఉందని, తన విద్యార్హత ఎంఏగా పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వార్షికాదాయం రూ.25 కోట్లని ఎన్నికల అఫిడవిట్ లో
పేర్కొన్నారు. తన ఆస్తుల విలువ రూ.376 కోట్లుగా వెల్లడించారు. శుక్రవారం పులివెందులలో నామినేషన్ వేసిన ఆయన ఈ వివరాలను పొందుపరిచారు.తనపై 31 కేసులు ఉన్నాయని, విద్యార్హత బీకాం అని అఫిడవిట్ లో వివరించారు. జనసేన అధ్యక్షుడు తన వార్షికాదాయం 7 కోట్లుగా వెల్లడిం చారు. తనపై కేసుల్లేవని, 45 కోట్ల ఆస్తులున్నాయని వివరిం చారు. తనవిద్యార్హతను పదో తరగతిగా పేర్కొన్నారు.
చంద్రబాబు
వార్షికా దాయం రూ.64,73,208
చరాస్తుల విలువ రూ. 47,38,067
స్థిరాస్తుల విలువ రూ. 28,22,15,924
మొత్తం ఆస్తుల విలువ రూ. 28,69,53,991
అప్పులు రూ. 5,24,96,605
భువనేశ్వరి (చంద్రబాబు సతీమణి )
వార్షికా దాయం రూ. 13,45,30,513
చరాస్తుల విలువ రూ. 573,84,17,434
స్థిరాస్తుల విలువ రూ. 76,89,13,116
మొత్తం ఆస్తుల విలువ రూ. 650,73,30,550
అప్పులు రూ.10,67,98,182
వైఎస్ జగన్
వార్షికా దాయం రూ.25,89,38,290
స్థిరాస్తుల విలువ రూ.36,11,70,556
చరాస్తుల విలువ రూ.339,89,43,352
మొత్తం ఆస్తులు రూ.376,01,13,908
ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ
రూ. 66,68,54,338
భారతి రెడ్డి (వైఎస్ జగన్ సతీమణి)
వార్షికా దాయం రూ.12,73,41,080
స్థిరాస్తుల విలువ రూ.47,27,29,385
చరాస్తుల విలువ రూ.92,53,49,352
మొత్తం ఆస్తుల విలువ రూ.139,80,78,737
పవన్ కల్యాణ్ ఆస్తులు
వార్షికా దాయం రూ. 7,32,44,340
చరాస్తుల విలువ రూ. 12,79,67,865
స్థిరాస్తుల విలువ రూ. 32,40,43,499
మొత్తం ఆస్తుల విలువ రూ. 45,20,11,364
అప్పులు రూ.33.72 కోట్లు