నిఖిల్ తరపున చంద్రబాబు ప్రచారం

నిఖిల్ తరపున చంద్రబాబు ప్రచారం

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) కర్ణాటకలో పర్యటించనున్నారు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జెడిఎస్ తరపున బాబు ప్రచారం చేయనున్నారు. మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి  మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు. నిఖిల్ తరపున ప్రచారం చేసేందుకు చంద్రబాబు రేపు కర్ణాటక వెళ్లనున్నారు.

అంతకుముందు ఏపీలో ఎన్నికల సమయంలో  దేవెగౌడ టీడిపీ ప్రచారంలో పాల్గొన్నారు. అందుకు ప్రతిగా నిఖిల్ కోసం చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. నిఖిల్ కు ప్రత్యర్థిగా అదే స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి నటి సుమలత పోటీచేస్తున్నారు.