చంద్రబాబు పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ వాయిదా

చంద్రబాబు పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్  పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణ చేపడతామని జస్టిస్ అనిరుధ్​ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది డివిజన్ ​బెంచ్ ​వెల్లడించింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం వాదనలు సాగాయి. 

బాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, ఏపీ సీఐడీ, ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించారు. హరీష్ సాల్వే వాదనలపై ముఖుల్ రోహత్గి అభ్యంతరం తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగమైందని, చంద్రబాబు చర్యలతో ఏపీకి నష్టం జరిగిందని ఆరోపించారు. మధ్యలో ధర్మాసనం జోక్యం చేసుకొని.. వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని ఇరు వర్గాలను ప్రశ్నించింది. 

దీనిపై స్పందిస్తూ... మరో గంట పాటు పడుతుందని ముకుల్ రోహత్గీ సమాధానం ఇచ్చారు. అయితే మిగతా వాదనలు శుక్రవారం విం టామని ధర్మాసనం స్పష్టం చేయగా.. చంద్ర బాబు తరఫు మరో న్యాయవాది సిద్ధార్థ లూ త్రా మంగళవారమే వాదనలు పూర్తయ్యేలా చూ డాలని విజ్ఞప్తి చేశారు. అయితే చాలా కేసులు ఉన్నందున... శుక్రవారం తదుపరి విచారణను చేపడతామని బెంచ్ స్పష్టం చేసింది.