చంద్రబాబుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ తీర్పు నవంబర్ 8

చంద్రబాబుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ తీర్పు నవంబర్ 8

చంద్రబాబు అండ్ టీం ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటిషన్  తీర్పును సుప్రీం వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్ర బాబు వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే నెల (నవంబర్) 8న వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అదే విధంగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు నవంబరు 9 న వింటామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో, ఆ తరువాతనే చంద్రబాబు బయటకు ఎప్పుడనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

తీర్పు వచ్చే నెల 8న  

చంద్రబాబు కేసులకు సంబంధించి సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. హైకోర్టులో కొట్టేసిన క్విష్ పిటీషన్ పైన చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తరఫున రెండుగంటలపాటు సాగిన వాదనల్ని విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం.  అక్టోబర్ 21 నుంచి 29 వరకు కోర్టుకు దసరా సెలవులున్నాయి.  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగియడంతో.. తీర్పు రిజర్వ్ చేసి.. నవంబర్ 8న వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో అప్పటివరకు చంద్రబాబు జైలులోనే ఉండాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది.

స్కిల్ కేసులో అనితీని నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ చంద్రబాబు తరపు న్యాయవాదులు...సీఐడీ తరపు న్యాయవాదుల మధ్య సుదీర్ఘంగా హోరా హోరీ వాదనలు జరిగాయి. న్యాయమూర్తులే పలు ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో ఇరు పక్షాలు లిఖిత పూర్వక వాదనలు దాఖలు చేయటానికి ఈ రోజు (అక్టోబర్ 20) సుప్రీంకోర్టు  చివరి రోజుగా నిర్దేశించింది. ఇక, ఇప్పుడు క్వాష్ పిటీషన్ పైన తీర్పును వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయటంతో..ఇప్పుడు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది. అటు విజయవాడ ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగించింది. తాజా పరిణామాలతో చంద్రబాబు నవంబర్ 8వ తేదీ సుప్రీం తీర్పు తరువాతనే ఎప్పుడు బయటకు వచ్చేది స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.