
హైదరాబాద్, వెలుగు : బీజేపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ చంద్రశేఖర్ తివారి నియమితులయ్యారు. యూపీకి చెందిన చంద్రశేఖర్.. రాజస్థాన్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది. 2017లో యూపీలో బీజేపీని గెలిపించడంలో కూడా కీలకంగా వ్యవహరించారు. అమిత్ షాకు తివారి అత్యంత సన్నిహితుడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్, చంద్రశేఖర్ తివారి కీలకంగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 10 సీట్లు గెలిచేలా ఇద్దరు కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పాయి. తెలంగాణలో దాదాపు రెండేండ్లుగా ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఈ హోదాలో పని చేసిన మంత్రి శ్రీనివాస్‌ను హైకమాండ్ పంజాబ్‌కు బదిలీ చేసింది.