చంద్రయాన్-2 : సూరత్ లో ప్రత్యేక ప్రదర్శన

చంద్రయాన్-2 : సూరత్ లో ప్రత్యేక ప్రదర్శన

చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా గుజరాత్ లోని సూరత్ లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. చంద్రయాన్-2 తో పాటు ఇస్రో ఇప్పటివరకు చేసిన ప్రయోగాలు, రికార్డులకు సంబంధించిన ఫోటోలు ప్రదర్శించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ ప్రత్యేకతలు, ప్రయోజనాలు తెలిసేలా బోర్డులు పెట్టారు. విద్యార్థులు చంద్రయాన్-2 సక్సెస్ కోరుతూ రంగోళి నిర్వహించారు. కలర్ ఫుల్ డిజైన్లతో చిత్రాలు గీశారు. చంద్రయాన్-2 తో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఖ్యాతి మరింత పెరుగుతుందన్నారు విద్యార్థులు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని అద్భుతాలు సాధిస్తుందని స్టూడెంట్స్ చెప్పారు.