చంద్రయాన్ 3: వహ్వా.. ఇస్రో!

చంద్రయాన్ 3: వహ్వా.. ఇస్రో!

చంద్రయాన్ 3 మిషన్ ను చేపట్టినప్పటి నుంచి చంద్రుడి ఉపరితలంపై విక్రమ్  ల్యాండర్  ల్యాండ్ వరకు ప్రపంచ దేశాల కళ్లన్నీ ఈ ప్రాజెక్టుపైనే ఉన్నాయి. గతంలో అమెరికా, రష్యా, చైనా పంపిన స్పేస్ క్రాఫ్ట్ లన్నీ చంద్రుడి భూమధ్యరేఖ ప్రాంతంలో దిగాయి. అత్యంత కఠినమైన నేలలు, ప్రతికూల వాతావరణం ఉండే దక్షిణ ధ్రువంపై దిగాలని అవి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా ఇటీవలే లూనా 25ను ప్రయోగించింది. కానీ, అది క్రాష్  ల్యాండ్  అవడంతో మిషన్ ఫెయిలైంది. 

అలాగే జపాన్​కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఈ ఏడాదిలో పంపిన స్పేస్ క్రాఫ్ట్ కూడా కూలింది. ఇజ్రాయెల్​కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కూడా 2019లో స్పేస్ క్రాఫ్ట్ ను పంపగా మధ్యలోనే పేలింది. అలాగే 2019లోనే మన ఇస్రో పంపిన చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ అయింది.  కానీ, ఈసారి మాత్రం విక్రమ్  ల్యాండర్  సాఫ్ట్ ల్యాండ్  కావడంతో మిషన్  సక్సెస్  అయింది. అమెరికా, రష్యా, చైనా దేశాలు సాధించని ఘనతను మన ఇస్రో సైంటిస్టులు సాధించి ఔరా అనిపించారు.