అనుకున్నట్లే.. చక్కగా పని చేస్తున్న చంద్రయాన్.. కక్ష్య మారి దూసుకెళుతుంది!

అనుకున్నట్లే.. చక్కగా పని చేస్తున్న చంద్రయాన్.. కక్ష్య మారి దూసుకెళుతుంది!

చంద్రునిపై అన్వేషణలో భాగంగా భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) చంద్రయాన్​–3ని రెండోసారి విజయవంతంగా కక్ష్యను పెంచింది. ఇప్పుడు లక్ష్యానికి 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు ఇస్రో తెలిపింది.  ఆర్టిట్​ భూమి గురుత్వాకర్షణ  నుంచి దాటి చంద్రునివైపు ప్రయాణిస్తోంది.  లక్ష్యం చేరుకునేందుకు భారత అంతరిక్ష సంస్థ మరో మూడు ఎర్త్ బౌండ్ విన్యాసాలను నిర్వహించనుంది.

కాగా.. శుక్రవారం చంద్రయాన్-–3 మిషన్ ను  సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి భారతదేశపు అత్యంత బరువైన లాంచ్ వెహికల్, లాంచ్ వెహికల్ మార్క్-3లో  ప్రయోగించబడింది. భూమి చుట్టు  ఓ ఖచ్చితమైన కక్ష్యలో మిషన్​ను చేర్చింది. ఈ క్రమంలో  మూడు దశలు సాధారణ స్థితిలో  విజయవంతమయ్యాయి. ఇది ఇస్రో చరిత్రలో మైలురాయి.  శ్రీహరికోటలోని స్పేస్‌పోర్ట్ నుంచి బయల్దేరిన సుమారు తొమ్మిది నిమిషాల తర్వాత చంద్రయాన్-–3 మిషన్ LVM-3 మూడవ దశలో అంతరిక్ష శూన్యంలోకి ప్రవేశించింది. ‘‘భారతీయ అంతరిక్ష వైజ్ఞానిక రంగంలో చంద్రయాన్​–3 చరిత్రను తిరగరాసింది. ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లిందని” చంద్రయాన్​ –3 ప్రయోగం తర్వాత విజయవంతం  ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు. 

కాగా.. ఈ వ్యోమ నౌక ఆగస్టు 3న చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ కానుంది. ఈ ల్యాండింగ్ విజయవంతం అయితే.. అమెరికా, చైనా, సోవియేట్​ యూనియన్ దేశాల సరసన ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో భారత్​చేరనుంది. చంద్రయాన్-–3 ఆరు చక్రాల ల్యాండర్,రోవర్ మాడ్యూల్ పేలోడ్లతో అమర్చబడి ఉంటుంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఇది చంద్రునిపై నేల, శిలల లక్షణాలు, వాటి రసాయన, మౌళిక కూర్పులతో సహా విలువైన డేటాను  స్పేస్​ సెంటర్​ చేరవేయనుంది. 

2019లో చంద్రుని దక్షిణ ధృవంపై రోబోటిక్​ వ్యోమ నౌకను ల్యాండ్​ చేసేందుకు భారత్​ చేసిన మొదటి ప్రయత్నం విఫలమైంది. ఇది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించినప్పటికీ  రోవర్​ మోహరించే ప్రయత్నంలో క్రాష్​ అయి ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయాయి. సాఫ్ట్‌వేర్ లోపమే ఇందుకు కారణమని ఇస్రోకు సమర్పించిన ఫెయిల్యూర్ అనాలిసిస్ రిపోర్టులో వెల్లడైంది.