ఆరోగ్యశాఖలో హెచ్‌‌‌‌‌‌‌‌వోడీల మార్పు! .. ప్రభుత్వం వద్దకు చేరిన ఫైల్స్‌‌‌‌‌‌‌‌

ఆరోగ్యశాఖలో హెచ్‌‌‌‌‌‌‌‌వోడీల మార్పు! .. ప్రభుత్వం వద్దకు చేరిన ఫైల్స్‌‌‌‌‌‌‌‌
  • మారనున్న వీసీ, డీఎంఈ, డీహెచ్‌‌‌‌‌‌‌‌, ఎండీ
  • డీఎంఈ రమేశ్ రెడ్డి నియామంకపై ఇప్పటికే విమర్శలు
  • హైకోర్టుకు ఎక్కిన డాక్టర్లు
  • కాళోజీ హెల్త్ వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి
  • వీసీగా కరుణాకర్ రెడ్డి మార్చే యోచనలో రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల హెచ్‌‌‌‌‌‌‌‌వోడీల మార్పునకు రంగం సిద్ధమైంది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌‌‌‌‌‌‌‌లర్, మెడికల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ‌‌‌‌‌‌‌‌పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ తదితరులను కొత్త ప్రభుత్వం మార్చనుంది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రమేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి నియామకంపై హైకోర్టులో డాక్టర్లు వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై ఈ నెల 21న విచారణ జరగనుంది.

ఆయన నియామకం చెల్లదని గతంలోనే హైకోర్టు తీర్పునిచ్చింది. రమేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టి వేస్తూ, కొత్త వారిని నియమించాలని సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు చేయకపోవడంతో, డాక్టర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో డీఎంఈకి, సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని హెల్త్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. ఈ లోగా ప్రభుత్వం మారిపోయింది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీఎంఈ నియామకాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ లీడర్లు తప్పుబట్టారు. ఇప్పుడు అధికారంలోకి రావడం, కోర్టు కేసు కూడా ఉండడంతో వెంటనే సీనియారిటీ లిస్ట్‌‌‌‌‌‌‌‌తో ఫైల్ పంపించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. 18 మంది అడిషనల్ డీఎంఈల పేర్లతో ప్రభుత్వానికి హెల్త్ సెక్రటరీ ఫైల్ పంపించారు. డాక్టర్లు త్రివేణి, శివ రామ్ ప్రసాద్, నరేంద్ర కుమార్, ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌.వాణి, ఎం.రమాదేశి, బి.నాగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డి.మోహన్‌‌‌‌‌‌‌‌ దాస్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. సీనియర్లకు ఇవ్వాలనుకుంటే వీరిలో ఎవరో ఒకరిని డీఎంఈ పదవి వరించే అవకాశం ఉంటుంది. అయితే, లిస్ట్​లో ఉన్న ఇతర ఏడీఎంఈలు కూడా పోస్టు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మారనున్న వైస్ చాన్స్​లర్

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి డాక్టర్ కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి వైస్ చాన్స్‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్నారు. ఆయన నియామకాన్ని యూనివర్సిటీ చాన్స్‌‌‌‌‌‌‌‌లర్ హోదాలో ఉండే గవర్నర్ వ్యతిరేకించినా, కేసీఆర్ సర్కార్ అతన్నే కొనసాగిస్తూ వచ్చింది. మెడికల్ సీట్ల భర్తీలో అనేకసార్లు తప్పులు దొర్లినా, సీట్లు బ్లాక్ చేసి అమ్ముకుంటున్నట్టు తేలినా వీసీగా కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డినే కేసీఆర్ కొనసాగించారు. ఈయన నియామకాన్ని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తప్పుబట్టింది.

ఇప్పుడు కరుణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం సీనియర్ డాక్టర్ల పేర్లను పరిశీలిస్తున్నది. గవర్నమెంట్ హాస్పిటల్స్​కు అవసరమైన మెడిసిన్, ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ కొనుగోలు చేసే మెడికల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ (టీఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఐడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిని కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. సుమారు ఐదేండ్లుగా ఆయనే ఎండీగా ఉన్నారు. దీంతో అతన్ని వేరే పోస్టులోకి మార్చి, కొత్త వ్యక్తిని ఎండీగా నియమించాలని భావిస్తున్నది.

సూపరింటెండెంట్ల మార్పు తప్పదు

గాంధీ, ఉస్మానియా, చెస్ట్ హాస్పిటల్, మెంటల్ హెల్త్ ఇన్​స్టిట్యూట్ సహా చాలా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఏండ్ల తరబడి పాతుకుపోయారు. వీరిని కూడా మార్చి కొత్తవారికి చాన్స్ ఇవ్వాలని డాక్టర్లు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా పనిచేసే వారిని నియమించాలని భావిస్తున్నది. హెచ్‌‌‌‌‌‌‌‌వోడీల మార్పు అనంతరం, కాలేజీల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌ను మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఎంఈగా ఉన్న రమేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌గా కూడా కొనసాగుతున్నారు. డీఎంఈగా ఆయన్ను తప్పిస్తే, గాంధీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌గా కొనసాగించడం లేదా నీలోఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసే అవకాశం ఉంది.

డీహెచ్ పోస్టుకు మస్త్ డిమాండ్

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌(డీహెచ్‌‌‌‌‌‌‌‌) శ్రీనివాస రావును మార్చాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్లు, సీనియర్ డాక్టర్ల పేర్లతో లిస్ట్ గవర్నమెంట్ వద్దకు చేరింది. అడిషనల్ డైరెక్టర్లు రవీందర్ నాయక్‌‌‌‌‌‌‌‌, అమర్ సింగ్ నాయక్, మోజీరాం రాథోడ్‌‌‌‌‌‌‌‌, పద్మజ, పుష్ప టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. వీళ్లలో ముగ్గురిపై అవినీతి తదితర ఆరోపణలున్నాయి. ఒకరికి రూరల్ సర్వీస్ అనుభవం లేదు. దీంతో ఇతర సీనియర్ డాక్టర్ల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం డీహెచ్‌‌‌‌‌‌‌‌గా ఉన్న శ్రీనివాస రావు కరోనా సమయంలో, ఆ తర్వాత కూడా వార్తల్లో నిలిచారు. దీంతో ఆ పోస్టు కోసం కొంత మంది డాక్టర్లు భారీ ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఇన్నాళ్లు డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన శ్రీనివాస రావును పూర్తిగా పక్కన పెట్టడమా, మరో పోస్టు అప్పగించడమా అనే అంశంపై గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.