పింఛన్ పథకానికి పేరు మార్పు.. రూ. 4వేలకు పెంపు..

పింఛన్ పథకానికి పేరు మార్పు.. రూ. 4వేలకు పెంపు..

ఏపీలో పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించింది ప్రభుత్వం.దీంతో పాటు 3వేలు ఉన్న పెన్షన్ ను 4వేలకు పెంచింది ఏపీ ప్రభుత్వం. లబ్దిదారులకు ఏప్రిల్‌ నుంచే పెంపును అమలు చేయనున్నారు. ఈ క్రమంలో జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్‌ నుంచి మూడు నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి అందజేయనుంది ప్రభుత్వం.

దివ్యంగులకు ప్రస్తుతం అందుతున్న 3వేల పెన్షన్ ను 6వేలకు పెంచింది చంద్రబాబు సర్కార్.తీవ్ర అనారోగ్యానికి గురైనవారికి, మంచాన పడ్డ వారికి ప్రస్తుతం అందుతున్న 5వేల పింఛన్ ను 15వేలకు పెంచింది ప్రభుత్వం.కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకున్న వారు, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ పేషేంట్స్ కి అందుతున్న 5 వేలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.ఈ క్రమంలో రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛనుదార్లకు పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏడాదికి గాను 33వేల కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.