పరీక్షా విధానాల్లోనూ మార్పులు తీసుకురావాలె : గవర్నర్ తమిళిసై

పరీక్షా విధానాల్లోనూ మార్పులు తీసుకురావాలె : గవర్నర్ తమిళిసై

మహబూబ్​నగర్​, వెలుగు: జాతీయ విద్యావిధానం వల్ల మాతృభాషకు ప్రాధాన్యం లభిస్తుందని, ఫలితంగా పిల్లల్లోనూ క్వాలిటీ పెరుగుతుందని గవర్నర్, పాలమూరు యూనివర్సిటీ చాన్స్​లర్ ​ తమిళిసై ​అన్నారు. ఇప్పుడు అమల్లో ఉన్న విధానాల వల్ల స్టూడెంట్లలో చదువులో క్వాలిటీ తగ్గుతోందనే కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని తెచ్చిందన్నారు. మహబూబ్​నగర్ లోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం సాయంత్రం జరిగిన కాన్వొకేషన్​కు ఆమె  చీఫ్ గెస్ట్​గా వచ్చారు.  యూజీ, పీజీ,  పీహెచ్​డీ చేసిన 72 మంది స్టూడెంట్లకు గోల్డ్​మెడల్స్​ను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డిగ్రీ ఉన్నత చదువులకు పునాది రాయి అని, పీజీ, పీహెచ్​డీ చేసి.. గోల్డ్​ మెడల్​ సాధించడంతోనే ప్రయాణం ఆగిపోకూడదన్నారు.  రీసెర్చ్​లు చేసి యూనివర్సిటీకి పేరు తీసుకురావాలన్నారు.  కొత్తగా వచ్చే స్టూడెంట్లకు మీ విజయం ప్రేరణ కలిగించాలన్నారు. శ్రమ, పట్టుదలతో పాటు అనేక సంతోషాలను  త్యాగం చేయడం వల్లనే మీరు మెడల్స్​సాధించగలిగారని, ఇందులో తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ సహకారాన్నీ గుర్తుంచుకోవాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​ వీసీ​బీజే రాయ్, పాలమూరు వర్సిటీ వీసీ లక్ష్మీకాంత్ ​రాథోడ్​ ఈ  జిల్లా వారేనని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​వీసీ​ బీజే రాయ్, పాలమూరు వర్సిటీ వీసీ లక్ష్మీకాంత్​ రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజ మంగతాయారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అడిషనల్​కలెక్టర్ సీతారామారావు, అడిషనల్ ఎస్పీ రాములు, ఆర్డీవో అనిల్ కుమార్ పాల్గొన్నారు.

మంత్రులు, కలెక్టర్​ దూరం

కాన్వొకేషన్​కు  జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్​ హాజరు కాలేదు.  కలెక్టర్​కు  బదులు అడిషనల్​కలెక్టర్​ సీతారామారావు గవర్నర్​కు స్వాగతం పలికారు. ఎస్పీ కూడా ఇతర పనుల్లో బిజీగా ఉండటంతో అడిషనల్​ ఎస్పీ రాములు గవర్నర్​కు స్వాగతం పలికి, బందోబస్తును పర్యవేక్షించారు.

హయ్యర్ ఎడ్యుకేషన్​లో.. ప్రమాణాలు పాటించాలె

హైదరాబాద్, వెలుగు: హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ స్టూడెంట్స్ కు ఎడ్యుకేషన్ అందించాలని కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల అధికారులను గవర్నర్ తమిళిసై ఆదేశించారు. గురువారం రాజ్ భవన్ లో రెండు యూనివర్సిటీ అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు.  ప్రమాణాలు పాటించడం ద్వారా అన్ని అంశాల్లో స్టూడెంట్స్ అవగాహన పొందుతారన్నారు. మహిళ పీహెచ్ డీ స్కాలర్స్ కి రీసెర్చ్ లో  మంచి వసతులు కల్పించాలన్నారు.  మహిళ ఫ్యాకల్టీకి, గర్ల్స్ కి మంచి వసతులు కల్పించాలని, దీని వల్ల డ్రాప్ అవుట్ శాతాన్ని నివారించవచ్చన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థుల హెల్త్ ప్రొఫెల్ ఖరారు చేయాలన్నారు. ఎడ్యుకేషన్ పూర్తవగానే జాబ్ లు సాధించే విధంగా స్కిల్స్ పై ఫోకస్ పెట్టాలని అధికారులను కోరారు.