పేటీఎం కస్టమర్లంతా HDFC,AXIS FASTagకు మారుతున్నారు

పేటీఎం కస్టమర్లంతా HDFC,AXIS  FASTagకు మారుతున్నారు

Paytm మేమెంట్స్ బ్యాంక్స్ లిమిటెడ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పేటీఎం ఫాస్టాగ్ యూజర్లంతా హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంకుల FASTag సేవల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించడం లేదంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లావా దేవీలను నిషేధించింది ఆర్బీఐ. సెంట్రల్ బ్యాంకు నిబంధనలతో పేటీఎం బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయాయి.. 2024 మార్చి 15 తర్వాత పేటీఎం నుంచి  తీసుకున్న ఫాస్టాగ్ కూడా పనిచేయదని ఆర్బీఐ చెప్పడంతో పేటీఎం ఫాస్టాగ్ యూజర్లతో ఆందోళన చెందుతున్నారు..ఈ క్రమంలో ఆర్బీఐ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు ఇతర ఫాస్టాగ్ వివిధ బ్యాంకుల ద్వారా ఫాస్టాగ్ లను పొందొచ్చని తెలిపింది.

ఫాస్టాగ్ అనేది దేశంలోని ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ.ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)  చే నిర్వహించబడుతోంది. ఫాస్టాగ్ లింక్ చేయడం ద్వారా ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతా లనుంచి నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ వినియోగిస్తుంది. 

ఫాస్టాగ్ కస్టమర్లు తమ ఖాతాలను వివిధ బ్యాంకులకు మార్చుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది హెచ్ డీ ఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంకలను ఎంచుకుంటున్నారని Paytm సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.