కాంగ్రెస్ పథకాలకు గ్యారంటీ లేదు: చంటి క్రాంతికిరణ్​

కాంగ్రెస్ పథకాలకు గ్యారంటీ లేదు: చంటి క్రాంతికిరణ్​

మునిపల్లి , వెలుగు : కాంగ్రెస్​ పథకాలకు గ్యారంటీ లేదని, వారు  చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి  మోసపోవద్దని ఆందోల్​ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దగోపులారం, పోల్కంపల్లి, చిన్నచెల్మెడ,  మల్లికార్జున్​పల్లి,  మల్లారెడ్డిపేట, బుసారెడ్డిపల్లి  గ్రామాల్లో ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో  నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు.

కాంగ్రెస్​నాయకులు చెప్పే మోసపూరిత మాటలను నమ్మవద్దన్నారు.  నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మీనాక్షి, ఎంపీపీ  శైలజ, నాయకులు సాయికుమార్, విజయ్​ కుమార్, శశికుమార్, సర్పంచులు కీర్తికుమారి, విజయ్​ భాస్కర్, విమలమ్మ, శివజ్యోతి, స్వప్న, హిమబిందు, ఎంపీటీసీలు రాజశేఖర్, శివకుమార్ పాల్గొన్నారు.