ట్విట్టర్ లో పెరగనున్న క్యారెక్టర్స్ లిమిట్

ట్విట్టర్ లో పెరగనున్న క్యారెక్టర్స్ లిమిట్

మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్నప్పటినుంచి ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే, తాజాగా ట్వీట్ క్యారెక్టర్స్ ని పెంచే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి  క్యారెక్టర్స్ లిమిట్ 280 ఉంది. దాన్ని 4000 లకు పెంచబోదున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి.

ఈ నిర్ణయానికి సంబంధించి ఎలాంటి వార్తలు అధికారికంగా వెల్లడించకపోయినా, ట్విట్టర్ యూజర్ తో మస్క్ చేసిన చాట్ దీనికి సంకేతంగా అనిపిస్తుంది. అందులో యూజర్ ‘ట్విట్టర్ క్యారెక్టర్స్ ని 4000లకు పెంచుతున్నారా’ అని అడిగేతే, దానికి మస్క్ ‘అవును’ అనే సమాధానం ఇచ్చాడు. అయితే, ఇదివరకు 140కి ఉన్న క్యారెక్టర్స్ ని కొన్ని నెలల క్రితమే 280 మార్చారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్ అయింది.