మైనర్ బాలికపై ఎమ్మెల్యే రేప్..చార్జిషీట్ ఫైల్

మైనర్ బాలికపై ఎమ్మెల్యే రేప్..చార్జిషీట్ ఫైల్

పాట్నాలోని తన ఇంట్లో  మైనర్ బాలికను  రేప్ చేశారని ఆర్జేడీ ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ పై చార్జిషీట్ దాఖలు  చేశారు పోలీసులు. అరుణ్ యాదవ్ పై మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద చార్జిషీట్ ఫైల్  చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరోజ్ కుమారి  చెప్పారు.  పరారీలో ఉన్న ఎమ్మెల్యే అరుణ్ యాదవ్ పై అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు ప్రత్యేక పోక్సో జడ్జి ఆర్కె సింగ్ . ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 10 కి వాయిదా వేశారు. 2019 సెప్టెంబరులో సెక్స్ రాకెట్టులో తన పేరు ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచి  అరుణ్ యాదవ్ పరారీలో ఉన్నారు.

see more news

కొత్త ట్రెండ్.. మా పెళ్లి ఖర్చు మాదే

రూ.10 కాయిన్ పై ఎలాంటి నిషేధం లేదు