జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు

హైదరాబాద్: గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జన్వడ ఫాం హౌస్ కేసులో ఛార్జీ షీట్ దాఖలు చేశారు మోకిలా పోలీసులు. బీఆర్ ఎస్ నేత కేటీఆర్ బావమరిది రాజ్ పాకల ఫాం హౌజ్ లో పార్టీ జరిగిందని, పార్టీకి అనుమతి తీసుకోకపోవడంతోపాటు అక్రమంగా మద్యం వినియోగించారని పోలీసులు చార్జీషీటులో పేర్కొన్నారు. ఆ పార్టీలో పాల్గొన్న వారికి అప్పట్లో డ్రగ పరీక్షలునిర్వహించగా ఈ కేసులో ఏ2 గా ఉన్న విజయ మద్దూరికి డ్రగ్ పాజిటివ్ అని తేలిందని తెలిపారు. దీంతో విజయ మద్దూరి NDPS కేసు నమోదు చేసినట్లు మోకిల పోలీసులు తెలిపారు. ఛార్జీషీటులో మొత్తం 356 మంది స్టేట్ మెంట్లు రికార్డు చేసినట్లు తెలిపారు. 

గతేడాదది అక్టోబర్ 26న  రంగారెడ్డి జిల్లా శంకర్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం జన్వాడ పరిధిలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ బామ్మర్ది  రాజ్‌‌‌‌‌‌‌‌ పాకాలకు చెందిన ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌లో పార్టీ జరిగింది.‌‌ అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు, ఫారిన్​లిక్కర్​వాడినందుకు ఎక్సైజ్ యాక్ట్​ కింద కూడా కేసు ఫైల్​చేశారు. ఫామ్​హౌస్లో నిర్వహించిన సోదాల్లో 12  ఫారిన్ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్‌‌‌‌‌‌‌‌..  ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన రెండు నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్స్.. 11 కేఎఫ్‌‌‌‌‌‌‌‌ బీర్లు.. 7.35 లీటర్లు టీజీ ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ బాటిల్స్ ను పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌ కార్డ్స్‌‌‌‌‌‌‌‌ సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను , ఏ2గా అతనికంపెనీ సీఈవో విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.