గూఢచారి వస్తున్నాడు

గూఢచారి వస్తున్నాడు

కమెడియన్‌‌గా తనకంటూ సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ‘వెన్నెల’ కిషోర్.. హీరోగా నటిస్తున్న చిత్రం ‘చారి 111’.  సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్. మురళీ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నారు. ‘మళ్ళీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. అదితి సోనీ నిర్మిస్తున్నారు. కన్‌‌ఫ్యూజ్‌‌ అయ్యే గూఢచారి పాత్రలో వెన్నెల కిషోర్ నవ్విస్తాడని ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్‌‌ టీజర్‌‌‌‌లో చూపించారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌‌ డేట్‌‌ను ప్రకటించారు. మార్చి 1న థియేటర్స్‌‌లో విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే స్పై ఏజెంట్... ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. కిషోర్, సంయుక్త స్పై రోల్స్ చేయగా, వాళ్లకు బాస్‌‌గా మురళీ శర్మ నటించారు’ అని చెప్పారు. ‘త్వరలో ట్రైలర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత అదితి సోనీ తెలిపారు.