జెన్యూన్‌‌ లవ్‌‌ స్టోరీ

జెన్యూన్‌‌ లవ్‌‌ స్టోరీ

మణికందన్, శ్రీ గౌరి ప్రియ జంటగా ప్రభురామ్ వ్యాస్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ట్రూ లవర్‌‌‌‌’.  దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌‌కెఎన్‌‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. శనివారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. హీరో మణికందన్ మాట్లాడుతూ ‘ఇందులో ప్రతి సీన్, మరో సీన్‌‌తో లింక్ అయి ఉంటుంది. ఒక్క సీన్ చూడకున్నా.. ఏం జరిగింది అనేది మిస్ అవుతారు. అంత పక్కాగా స్క్రీన్ ప్లే చేసిన సినిమా ఇది’ అని అన్నాడు. ‘తమిళ ప్రీమియర్స్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తెలుగులోనూ హిట్ చేస్తారని నమ్ముతున్నాం’ అని శ్రీ గౌరి ప్రియ చెప్పింది. మారుతి మాట్లాడుతూ ‘దర్శకుడు చాలా జెన్యూన్‌‌గా ఈ కథను చూపించాడు. ఫ్యామిలీస్‌‌ కూడా  ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడొచ్చు. హీరోహీరోయిన్స్‌‌ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాను ఇష్టపడతారని ఆశిస్తున్నాం’ అన్నాడు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ ‘ప్రేమికురాలి విషయంలో అబ్బాయిలో ఉండే అభద్రతను తన నటనలో సహజంగా చూపించాడు మణికందన్. అలాగే లవర్ ఇన్ సెక్యూరిటీని చూసి బాధపడే అమ్మాయిగా శ్రీ గౌరి ప్రియ నటన ఆకట్టుకుంటుంది. కంటెంట్‌‌పై నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నాం. ఈ వాలెంటైన్ డేకు విన్నర్ అవుతుంది. ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకుంటుంది’ అని చెప్పాడు.