
ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే స్టడీ మోడ్. ఈ ఫీచర్ ద్వారా సెర్చింగ్ మరింత ఈజీ అవుతుంది. ఈ ఫీచర్‌ను చాట్‌జీపీటీ ప్లస్, ప్రో, టీమ్ ప్లాన్లలో లాగిన్ అయినవాళ్లకు ఫ్రీగా అందిస్తోంది. త్వరలో ఈ ఫీచర్ చాట్‌జీపీటీ ఎడ్యు(edu)లో కూడా కనపడనుంది. ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే.. భారతదేశంలోని 11 భాషల్లో అందుబాటులో ఉంది.
దీనిలో వాయిస్, ఇమేజ్, టెక్స్ట్ ఇన్పుట్ సపోర్ట్ చేస్తుంది. స్టడీ మోడ్‌ని స్టూడెంట్స్ ప్రశ్నలకు సమాధానాలతోపాటు గైడెన్స్ కూడా ఇస్తుంది. తద్వారా ఈజీగా నేర్చుకోగలుగుతారు. బీటా టెస్ట్‌లో ఈ మోడ్‌ను ఇండియన్ స్టూడెంట్స్‌తోనే ట్రయల్స్ చేశారు. ఇది డైలీ రొటీన్ సెర్చ్‌ల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ప్రతీది కవర్ చేసింది.
దీన్ని ఎలా వాడాలంటే.. చాట్‌జీపీటీలోని టూల్స్ సెక్షన్‌కి వెళ్లి అక్కడ స్టడీ అండ్ లెర్న్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. తర్వాత ప్రశ్న అడిగితే.. ఏఐ ఒక స్పష్టమైన సమాధానాన్ని దశలవారీగా ఇస్తుంది. ఇచ్చిన జవాబు నచ్చకపోయినా లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా మళ్లీ ఆదేశాలు ఇవ్వొచ్చు.