
OpenAI కి చెందిన ఫేమస్ AI చాట్ బాట్ అయిన ChatGPT ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. చాలా మంది కస్టమర్లు ChatGPT చాట్ బాట్ ను యాక్సెస్ చేయడంలో లేదా ప్రశ్నలకు సమాధానాలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.భారత్,US ,UK అంతటాChatGPT పనిచేయకపోవడంతో కస్టమర్లు అసౌకర్యానికి గురయ్యారు.
ముఖ్యంగా భారత్, అమెరికాలో ఈ అంతరాయం ఎక్కువగా ఉంది. వేల సంఖ్యలో వినియోగదారులు సమస్యలను రిపోర్ట్ చేశారు. యాక్సెస్ చేయడంలో లేదా ప్రశ్నలకు సమాధానాలు అడిగినప్పుడు "Hmm…something seems to have gone wrong" , "A network error occurred. Please check your connection and try again" వంటి ఎర్రర్ మెసేజ్లను కనిపిస్తున్నాయి.
OpenAI ట్రాక్ చేసే వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం.. వెబ్ ,యాప్ లోని చాట్ బాదట్ సేవల్లో వినియోడదారులు లాగిన్ సమస్యలు ఎదుర్కొన్నారు. భారత్ లో దాదాపు 800 కంప్లైంట్లు, యూఎస్ 1100, యూకె లో 1450 కంటే ఎక్కువమంది కస్టమర్లు AI చాట్ బాట్ సమస్యలను రిపోర్టు చేశారు. వెబ్ చాట్ బాట్ లో 90 శాతం సమస్యలు, యాప్ లో 10 శాతం మంది కస్టమర్లరు తన సమస్యలను తెలిపారు. వీటిలో లాగిన్, API లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి.
OpenAI కూడా తమ అధికారిక స్టేటస్ పేజీలో ఈ సమస్యను ధృవీకరించింది. ChatGPT ,Sora వంటి ఇతర సేవలు కూడా ప్రభావితమయ్యాయని ప్రస్తుతం ఈ సమస్యను పరిశీలిస్తు్న్నామని చెబుతోంది. ఈ అంతరాయం కారణంగా సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు నిరాశను వ్యక్తం చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.