పెద్దపల్లి జిల్లాలో రూ.31 కోట్ల చెక్ డ్యాం.. రాత్రికి రాత్రే కూల్చివేత.. ఇసుక తవ్వకాల కోసమేనంటూ అనుమానం..?

పెద్దపల్లి జిల్లాలో  రూ.31 కోట్ల చెక్ డ్యాం.. రాత్రికి రాత్రే కూల్చివేత..  ఇసుక తవ్వకాల కోసమేనంటూ అనుమానం..?

పెద్దపల్లి జిల్లాలో కొత్తగా నిర్మించిన చెక్ డ్యామ్  కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఓదెల మండలం గుంపుల మానేరు వాగు పై కట్టిన చెక్ డ్యాం రాత్రికి రాత్రే కూలిపోయింది.  గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

చెక్ డ్యామ్ తెగిపోవడంతో నీరు వృధాగా పోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వాగులో ఇసుక తవ్వకాల కోసమే చెక్ డ్యామ్ కూల్చి వేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన చెక్ డ్యామ్ ను కూల్చివేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల డిమాండ్ చేస్తున్నారు.