పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు పంపిణీ

పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు పంపిణీ

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: మరణించిన పోలీసు కానిస్టేబుల్ కుటుంబానికి గురువారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినగర్ చెక్కు పంపిణీ చేశారు. ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో కే. రామాంజనేయ రెడ్డి కానిస్టేబుల్ గా పని చేస్తూ అనారోగ్యంతో డిసెంబర్ 24, 2023 సంవత్సరంలో మృతి చెందాడు.  ఆయన సతీమణి కే.రోజా కు పోలీస్ కమిషనర్  రూ. 8లక్షల చెక్కును గురువారం అందజేశారు.  కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, చైతన్య రెడ్డి, డీసీపీ కోటేశ్వరరావు, ఏవో శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ డీపీవో తదితరులు పాల్గొన్నారు.