ఈ స్వీట్ కాంబోతో మలబద్దకం, గ్యాస్‌, అజీర్తి, జీర్ణ సమస్యలకు చెక్

ఈ స్వీట్ కాంబోతో మలబద్దకం, గ్యాస్‌, అజీర్తి, జీర్ణ సమస్యలకు చెక్

ఖజూర్రాలు తేనెలో నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒక జార్ లో మూడువంతుల తేనెను తీసుకొని విత్తు తీసిన ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి. ఆ జార్ ని బాగా షేక్‌ చేసి వారం రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి. తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు తినాలి. ఇలా చేస్తే ఇమ్యూనిటీ పవర్‌‌ పెరిగి దగ్గు, జలుబు, జ్వరం వంటివి దగ్గరికి రావు. శ్వాస సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఇది మంచి మందుగా పని చేస్తుంది. స్ట్రెస్‌, యాంగ్జైటీ దూరమవుతాయి. దీనిలో ఉండే యాంటిబయాటిక్‌ గుణాలు గాయాలు తొందరగా మానేందుకు సాయపడుతుంది. పిల్లలకు రోజూ ఈ మిశ్రమం తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఆడవాళ్లకు కావాల్సిన కాల్షియం, ఐరన్‌ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్త హీనతను తగ్గించి, ఎముకలను స్ట్రాంగ్ గా మారుస్తాయి. డయాబెటీస్‌తో బాధపడేవాళ్లూ దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. షుగర్‌ లెవెల్స్‌ కంట్రోల్ లో ఉంటాయి. మలబద్దకం, గ్యాస్‌, అజీర్తి, వంటి జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. ఖర్జూరం తేనె కలిపి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.