అమ్రాబాద్ మండలంలో లేగదూడను చంపిన చిరుత

అమ్రాబాద్ మండలంలో లేగదూడను చంపిన చిరుత

అమ్రాబాద్, వెలుగు : మండలంలోని మన్ననూర్  గ్రామంలో ఆదివారం ఉదయం లేగదూడపై చిరుత దాడి చేసి చంపింది. ఫారెస్ట్  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మజీద్  వెనక పంట పొలాల్లో ఉన్న లేగదూడపై ఆదివారం తెల్లవారుజామున చిరుత దాడి చేసి చంపేసింది.

ఫారెస్ట్  ఆఫీసర్లు చిరుత కాలి గుర్తులు పరిశీలించారు. ప్రజలు, రైతులు అలర్ట్​గా ఉండాలని సూచించారు.