
తొర్రూరు, వెలుగు : మురుగు కాల్వలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం దొరికింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తొర్రూరు పెద్ద చెరువు సమీపంలో మురుగు కాల్వలో శిశువు డెడ్ బాడీ కనిపించింది. దీంతో పోలీసులు, అధికారులకు స్థానికులు కసమాచారం అందించారు.
డీఎంహెచ్ఓ అంబరీశ్, సీడబ్ల్యూసీ చైర్మన్ నాగవాణి, పోలీసుఅధికారులు అక్కడికి చేరుకొని శిశువు మృతదేహాన్ని బయటకు తీయించారు. బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాంజీ నాయక్ తెలిపారు.