
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఏటూరునాగారం, వెలుగు: సెక్రటేరియేట్‌లో అధికారులతో పరిచయం ఉందని, గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుడిని ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంంలోని కవిరాజ్ నగర్ కు చెందిన తేజావత్ అనిల్ నాయక్ అలియాస్ కేతన్ నకిలీ ఐడీ కార్డులు, ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు చూపించి గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని మోసం చేశాడు.
2019లో వెంకటాపురంకు చెందిన గొంది లావణ్యకు ట్రాన్స్‌కో డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నకిలీ ఐడీ కార్డులు, ఉత్తర్వు కాపీలు చూపించి ఉద్యోగం ఇస్తున్నట్లు నమ్మించాడు. 2020 నుంచి-22 వరకు లావణ్య ద్వారా మరో 26 మందిని నమ్మించి రూ.72 లక్షలు- తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు. భాదితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సోమవారం వెంకటాపురం బస్టాండ్‌లో అనిల్ నాయక్‌ను ఎస్సై కె. తిరుపతిరావు, సీఐ ముత్యం రమేశ్ అదుపులోకి తీసుకున్నారు.