
చెన్నై: ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ పేలిన ఘటన ఇవాళ చెన్నై ఎయిర్ పోర్ట్ లో జరిగింది. విమానం ఒక్కసారిగా వంపులు తిరుగింది. పైలర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న 142 మంది ప్రయాణికులు క్షేమంగా బయపడ్డారు. పైలట్ అప్రమత్తతతో వ్యవహరించి విమానాన్ని అదుపులోకి తేవడంతో తృటిలో ముప్పుతప్పింది. ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.