
ముంబై: వారెవ్వా.. ఏం మ్యాచ్. రెండు మేటి జట్లు మనసు పెట్టి ఆడితే ఆట ఎలా ఉంటుందో.. చెన్నై, కోల్‌కతా మ్యాచ్ నిరూపించింది. డుప్లెసిస్ (60 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 95 నాటౌట్) వీరవిహారం చేస్తే... టార్గెట్ ఛేజింగ్‌లో కమిన్స్ (34 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్), రసెల్ (22 బాల్స్‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54), దినేశ్ కార్తీక్ (24 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) ఆటను మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఫోర్లు, సిక్సర్ల జడివాన కురిపిస్తూ చెన్నై శిబిరంలో ఉత్కంఠ రేపినా.. లాస్ట్‌లో వికెట్లు లేకపోవడం నైట్‌రైడర్స్‌కు బ్యాడ్‌లక్‌గా మారింది. కనీసం ఒక్క వికెట్ చేతిలో ఉన్నా.. ఫలితం మరోలా ఉండేది. ఓవరాల్‌గా 400లకు పైగా పరుగుల మోత మోగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 18 రన్స్ స్వల్ప తేడాతో కోల్‌కతాపై నెగ్గింది. దీంతో వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 220/3 స్కోరు చేసింది. డుప్లెసిస్‌కు తోడుగా రుతురాజ్ (42 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) రాణించాడు. తర్వాత కోల్‌కతా 19.1 ఓవర్లలో 202 రన్స్‌కు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌కు.. స్టార్టింగ్‌లో దీపక్ చహర్ (4/29) దెబ్బకొడితే లాస్ట్‌లో ఎంగిడి (3/28) అడ్డుకట్ట వేశాడు. డుప్లెసిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
డుప్లెసిస్, రుతురాజ్ హోరు..
టాస్ ఓడినా.. ఫస్ట్ బ్యాటింగ్‌లో చెన్నైకి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. చాలా రోజుల తర్వాత ఓపెనర్ రుతురాజ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండోఎండ్‌లో డుప్లెసిస్ కూడా తోడయ్యాడు. ఇద్దరు భారీ షాట్లు ఆడడంతో ఫస్ట్ టెన్‌లో చెన్నై 82/0 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. నాగర్‌కోటి వేసిన 11వ ఓవర్‌లో సిక్స్ కొట్టిన రుతురాజ్ 33 బాల్స్‌లో ఫిఫ్టీ కంప్లీట్ చేశాడు. డుప్లెసిస్ కూడా సిక్సర్ బాదడంతో ఈ ఓవర్‌లో 16 రన్స్ వచ్చాయి. తర్వాతి ఓవర్‌లో 4, 6తో 17 రన్స్ పిండుకున్న రుతురాజ్.. 13వ ఓవర్ సెకండ్ బాల్‌కు ఔటయ్యాడు. దీంతో ఫస్ట్ వికెట్‌కు 115 (77 బాల్స్) రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఆ వెంటనే బౌండ్రీతో డుప్లెసిస్ కూడా 35 బాల్స్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొయిన్ అలీ (25) వచ్చి రావడంతోనే అటాకింగ్ మొదలుపెట్టడంతో 15 ఓవర్లలో చెన్నై 144/1కి పెరిగింది. తర్వాతి రెండు ఓవర్లలో రెండు సిక్సర్లు కొట్టి అలీ వెనుదిరగడంతో సెకండ్ వికెట్‌కు 46 (27 బాల్స్) రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో వచ్చిన ధోనీ (17) ఫోర్‌తో టచ్‌లోకి వచ్చాడు. 18వ ఓవర్‌లో 4, 6తో 14 రన్స్ రాబట్టాడు. 19వ ఓవర్ (రసెల్)లో డుప్లెసిస్ వరుసగా 4, 4, 4 కొడితే, ధోనీ భారీ షాట్‌కు ప్రయత్నించి మోర్గాన్ చేతికి చిక్కాడు. థర్డ్ వికెట్‌కు 36 రన్స్ రావడంతో సీఎస్‌కే స్కోరు 200 దాటింది. లాస్ట్ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టి సెంచరీకి చేరువగా వచ్చిన డుప్లెసిస్ టార్గెట్‌ను రీచ్ కాలేకపోయాడు. ఆఖరి బాల్‌ను జడేజా (6 నాటౌట్) సిక్సర్‌గా మల్చి కోల్‌కతా ముందు భారీ టార్గెట్ ఉంచాడు.
వణికించిన రసెల్, కమిన్స్
టార్గెట్ ఛేజింగ్‌లో కోల్‌కతాకు స్టార్టింగ్‌లోనే ఎదురుదెబ్బలు తగిలాయి. పేసర్ దీపక్ చహర్ (4/29) పేస్ దెబ్బకు కేకేఆర్ టాప్ ఆర్డర్ చెల్లాచెదురైంది. గిల్ (0)తో మొదలైన పతనం నితీశ్ రాణా (9), రాహుల్ త్రిపాఠి (8), మోర్గాన్ (7), నరైన్ (4) వరకు కొనసాగింది. కేవలం 5.2 ఓవర్లలోనే వీళ్లు పెవిలియన్‌కు చేరడంతో కోల్‌కతా 31/5 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన దినేశ్ కార్తీక్, రసెల్ ఒక్కసారిగా గేర్ మార్చారు. బౌండ్రీతో ఖాతా తెరిచిన రసెల్.. సీఎస్‌కే బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఆరో ఓవర్‌లో 4, 4, 6తో రెచ్చిపోయాడు. రెండో ఎండ్‌లో కార్తీక్ ఫోర్లతో జోరు చూపెట్టాడు. ఇక ఠాకూర్ వేసిన 10వ ఓవర్‌లో రసెల్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. 6, 4, 6, 6తో 24 రన్స్ పిండుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో కార్తీక్ ఫోర్ కొడితే, రసెల్ సిక్సర్ దంచాడు. ఈ క్రమంలో రసెల్ 21 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేకేఆర్ గెలుపుపై ఆశలు పెంచుకుంటున్న టైమ్‌లో కరన్ ఊహించని షాకిచ్చాడు. లెగ్‌సైడ్ వేసిన ఔట్ స్వింగర్‌ను ఆడకుండా వదిలేసిన రసెల్ క్లీన్‌బౌల్డ్ కావడంతో ఆరో వికెట్‌కు 81 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. రసెల్ ఔటయ్యాక కార్తీక్ జోరందుకున్నాడు. 6, 4 బాదినా.. 15వ ఓవర్‌లో ఎంగిడి దెబ్బకు పెవిలియన్‌కు చేరాడు. 15 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 146/7 స్కోరు చేసింది. ఇక గెలవాలంటే లాస్ట్ 30 బాల్స్‌లో 75 రన్స్ అవసరమైన దశలో కమిన్స్... కరన్ వేసిన 16వ ఓవర్‌లో వరుసగా 2, 6, 6, 6, 4, 6తో 30 రన్స్ బాది ఆశలు రేకెత్తించాడు. కానీ తర్వాతి ఓవర్ బౌలింగ్‌కు దిగిన ఎంగిడి.. ఐదు రన్స్ ఇచ్చి నాగర్‌కోటి (0)ని ఔట్ చేశాడు. 18వ ఓవర్‌లో 12 రన్స్ రావడంతో విక్టరీ ఈక్వేషన్ లాస్ట్ రెండు ఓవర్లలో 28 రన్స్‌గా మారింది. 19వ ఓవర్లో కమిన్స్ సిక్స్ బాదినా.. చక్రవర్తి (0) రనౌటయ్యాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 20 రన్స్ చేయాల్సిన టైమ్‌లో ప్రసిధ్ (0) రనౌట్‌కావడంతో కేకేఆర్‌కు ఓటమి తప్పలేదు.