ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు కోసం వెతుకున్న భద్రతా బలగాలు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు కోసం వెతుకున్న భద్రతా బలగాలు

చెన్నై నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇండిగో ఫ్లైట్ 6E 5314కు ఓ అఘాంతకుడు ఫోన్ చేసి బాంబు ఉందని చెప్పడంతో ఫ్లైట్ ను ల్యాండ్ చేశారు సిబ్బంది.  ముంబైలో ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది ప్రోటోకాల్‌ను అనుసరించారు. భద్రతా ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులంతా సురక్షితంగా విమానం నుంచి దిగారు. 

భద్రతా బలగాలు విమానాన్ని క్షుణ్నంగా తనికీలు చేస్తున్నాయి. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచబడుతుందని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు హెచ్చరికలు ఇచ్చిన వారి కోసం పోలీసులు వెతుకున్నట్టు తెలుస్తుంది.