ధోని సారథ్యంలో చెన్నై అరుదైన రికార్డు

ధోని సారథ్యంలో చెన్నై అరుదైన రికార్డు

 చెన్నై సూపర్ కింగ్స్..ఐపీఎల్లో సెకండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్. ముంబై ఇండియన్స్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక టైటిళ్లు గెలుచుకుంది. CSKఇప్పటివరకు నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలవగా.... ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ సాధించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మరో మైలురాయికి చేరుకోనుంది. ఏప్రిల్ 12వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు 200వ మ్యాచ్ కానుంది. ధోని సారథ్యంలో ఈ అరుదైన రికార్డును చెన్నై సాధించబోతుంది. 

ధోనీ కెప్టెన్సీలో చెన్నై ఇప్పటివరకు 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇందులో  నాలుగుసార్లు  ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2008, 2009, 2018, 2021లో ఐపీఎల్ కప్‌ను దక్కించుకుంది. అయితే 2016, 2017 సీజన్లలో ఆడలేదు. ఇక 2020, 2022 సీజన్లల్లో దారుణమైన ఆటతీరును ప్రదర్శించింది. 

ఈ నేపథ్యంలో 2023 సీజన్ ను ధోనిసేన అద్బుతంగా ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత పుంజుకుని లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌ పై గెలిచింది. ఏప్రిల్ 12వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.