చెన్నై సిటీలో హై అలర్ట్ : సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ వార్నింగ్

చెన్నై సిటీలో హై అలర్ట్ : సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ వార్నింగ్

తమిళనాడు రాష్ట్రంలో పోలీసులు ఉరుకులు, పరుగులు. 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం పోలీసులకు వచ్చిన ఓ ఈ మెయిల్ కలకలం రేపింది. సీఎం స్టాలిన్ ఇంటిని పేల్చేస్తున్నామని.. బాంబులు పెట్టామంటూ ఆ మెయిల్ లో ఉంది. సీఎం ఇంటినే కాదు.. గవర్నర్ ఇంట్లోనూ బాంబులు పెట్టామంటూ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. అదే విధంగా నటి త్రిష, ఇతర రాజకీయ ప్రముఖల ఇళ్లకు ముప్పు ఉందంటూ పెద్ద లేఖ వచ్చింది పోలీసులు.

ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న వరస సంఘటనలు.. మొన్నటికి మొన్న నటుడు, పొలిటికల్ లీడర్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాటలో 40 మంది వరకు చనిపోయారు.. ఈ తర్వాత ఓ ఫ్యాక్టరీలో ప్రమాదంలో 9 మంది చనిపోయారు.. ఇలా పొలిటికల్ హీట్ నడుస్తున్న టైంలో.. ఇలాంటి బెదిరింపు లేఖ రావటంతో చెన్నై పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. లేఖను లైట్ తీసుకోకుండా హై అలర్ట్ అయ్యారు పోలీసులు.

ALSO READ : కర్నూలు జిల్లా దసరా ఉత్సవాల్లో కర్రల సమరం...

సీఎం స్టాలిన్ ఇంటితోపాటు గవర్నర్, నటి త్రిష ఇళ్ల దగ్గర తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ తో సోదాలు చేశారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపించారు.. వాళ్ల లక్ష్యం ఏంటీ అనే దిశగా చెన్నై సైబర్ క్రైం, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేపట్టారు.