యూట్యూబర్ స్మగ్లింగ్ ఐడియా.. 2 నెలల్లో రూ.3 కోట్లు సంపాదించాడు

యూట్యూబర్ స్మగ్లింగ్ ఐడియా.. 2 నెలల్లో రూ.3 కోట్లు సంపాదించాడు

అతను యూట్యూబర్.. యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటాడు.. బిజినెస్ కు సంబంధించి షార్ట్స్, రీల్స్, లైవ్ అంటూ హడావిడి.. చెన్నై సిటీలోని వ్యాపారాలకు సంబంధించి ఇతను యూట్యూబర్ గా వీడియో చేస్తున్నాడు.. ఇతన్ని గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా ట్రాప్ లోకి లాగింది.. ఇతనితో ఎయిర్ పోర్టులో ఓ షాపు ఓపెన్ చేయించింది.. గోల్డ్ స్మగ్లింగ్ లో పాత్రదారుడిని చేసింది ఆ మాఫియా.. ఎంతలా అంటే.. జస్ట్ రెండు అంటే రెండు నెలల్లోనే ఈ యూట్యూబర్ ఏకంగా 3 కోట్ల రూపాయలు సంపాదించాడు.. అది కూడా కమీషన్ కింద మాత్రమే.. ఈ బండారం బయటపడటంతో.. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీలంకకు చెందిన ఓ స్మగ్లర్ లోకల్ యూట్యూబర్‌ మహ్మద్ సాబిర్‌తో షాప్ పెట్టించగా అతడు 2నెలల్లోనే రూ.167కోట్ల విలువైన 267kgల బంగారం అక్రమంగా తరలించాడు. అయితే 2024 జూన్ 29న ఒక ఉద్యోగిని అనుమానించిన కస్టమ్స్ అధికారి దుకాణంలో  కిలల బంగారు పొడిని గుర్తించడంతో మొత్తానికి గుట్టురట్టయింది.  సబీర్ అలీ, దుకాణంలో పనిచేసి ఏడుగురు ఉద్యోగులకు బంగారాన్ని అక్రమంగా తరలించడానికి స్మగ్లింగ్ ముఠా శిక్షణ ఇచ్చింది. అధికారికంగా బొమ్మలు, సావనీర్‌లు, బ్యాగులు విక్రయించే ఈ దుకాణంలో బంగారం స్మగ్లింగ్‌ జరుగుతున్నట్టు వెల్లడయ్యింది. 

Also Read:సల్మాన్ ఖాన్ ను చంపటానికి రూ.25 లక్షల సుపారీ

బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన ఉద్యోగితో పాటు ట్రాన్సిట్ ప్యాసింజర్‌ను అదుపులోకి తీసుకున్నారు, ఆ తర్వాత  షాపు సిబ్బంది ఏడుగురిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) జారీ చేసిన గుర్తింపు కార్డులను మొత్తం ఎనిమిది మంది సభ్యులు  ఎలా పొందారనేది కస్టమ్స్ విభాగం ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది , ఎందుకంటే వారు కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే. ఇది విమానాశ్రయ నిబంధనలను ఉల్లంఘించడమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.