చెన్నూరు కాంగ్రెస్ టికెట్ వివేక్ వెంకట స్వామికి ఇవ్వాలి : నల్లాల ఓదేలు

చెన్నూరు కాంగ్రెస్  టికెట్ వివేక్ వెంకట స్వామికి ఇవ్వాలి  :  నల్లాల ఓదేలు

చెన్నూరు కాంగ్రెస్ టికెట్ ను వివేక్ వెంకట స్వామికి ఇవ్వాలని కోరారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ఆయనకు ఇస్తే ఎలాంటి బేషజాలకు పోకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానన్నారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ అసంతృప్తి నేతల బుజ్జగింపు కమిటీ  చైర్మన్ జానారెడ్డి నివాసంలో చెన్నూరు అసెంబ్లీ టికెట్ విషయమై వివేక్ వెంకట స్వామితో కలిసి చర్చించారు. అధిష్టానం ఎవ్వరికీ టికెట్ ఇచ్చిన కలిసి పనిచేస్తామని నిర్ణయించారు.

ALSO READ :- ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా ఎట్ల వస్తయ్ : కేసీఆర్‌