ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా ఎట్ల వస్తయ్ : కేసీఆర్‌

 ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా ఎట్ల వస్తయ్ : కేసీఆర్‌


ఎన్నికలు వస్తయ్... పోతయ్  ఎవరో ఒకరు గెలుస్తరు కానీ ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా అలోచించాలని  ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు.  ఓటు మన తలరాతను, భవిష్యత్తును  మార్చుతుందని చెప్పారు. పోటీ చేసే  అభ్యర్థి,పార్టీ చరిత్ర చూడాలన్నారు.  అదిలాబాద్ జిల్లా భైంసాలో  జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.  

ధరణి పోర్టల్  ఉంది కాబట్టే రైతుల ఖాతాల్లో  రైతుబంధు  డబ్బులు నేరుగా  వస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు.  ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తాయన్నారు.   రైతుబంధు దుబారా అని, 24 గంటల కరెంట్ అవసరం లేదని కాంగ్రెస్ వద్దంటుందని అవి ఉండాలో, వద్దో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. దేశంలో 24 గంటల పాటు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.  

ప్రధాని మోదీకి ప్రైవేటు పిచ్చిపట్టిందని సీఎం కేసీఆర్ విమర్శించారు.  బీజేపీ అంటేనే ప్రైవేటీకరణ అని అన్నారు.   పోలాల వద్ద మోటార్లుకు మీటర్ పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేసిందని కానీ తాను ప్రాణం పోయిని   పెట్టనని చెప్పానన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు.  కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదన్నారు. అలాంటి  బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.  పదేళ్లలో రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు కరువు లేదని చెప్పారు.