సింగరేణిని ప్రైవేటీకరణ కానివ్వం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సింగరేణిని ప్రైవేటీకరణ కానివ్వం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల: సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులతో సమావేశంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించినందుకు కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు సర్య్కూలర్ జారీ చేశామన్నారు. 

దివంగత మాజీ ఎంపీ, కేంద్ర మంత్రి వెంకటస్వామి జైపూర్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. త్వరలో పవర్ ప్లాంట్ లో మూడవ యూనిట్ ను పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.

రానున్న రోజుల్లో సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.