చెరువుగట్టు జాతర ప్రారంభం.. 16న కళ్యాణోత్సవం

చెరువుగట్టు జాతర ప్రారంభం.. 16న కళ్యాణోత్సవం
  •  17వ తేదీన  ముగింపు

హైదారబాద్​: ఈ నెల 4 న చెరువుగట్టు జాతర ప్రారంభం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడి వెల్లడించారు. సచివాలయంలో తన ఛాంబర్ లో  చెరువుగట్టు బ్రహ్మోత్సవాల నిర్వాహణపై బుధవారం అధికారులతో మంత్రి వెంకట్ రెడ్డి రివ్యూ నిర్వహించి  బ్రహ్మోత్సవాల పోస్టర్, సమాచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండో శ్రీశైలంగా పేరొందిన పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టు బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తామన్నారు.

16న అర్ధరాత్రి కళ్యాణోత్సవం ప్రారంభమై 17న ముగుస్తుందన్నారు. స్వామివారికి అధికారికంగా తలంబ్రాలు సమర్పిస్తామన్నారు.  భక్తుల కోసం  మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకుపలు సూచనలు చేశారు.  కార్యక్రమంలో   నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,  ప్రధాన అర్చకుడు  రామలింగేశ్వర శర్మ  తదితరులు పాల్గొన్నారు.