ఆ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలుండాల్సిందే

ఆ ప్రకటనల్లో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలుండాల్సిందే

చెన్నైలో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్ 2022కి సంబంధించిన అన్ని ప్రకటనల్లోనూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీల ఫోటోలు ఉండేలా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని  మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించింది. రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలతో కూడిన ప్రకటనలను టాంపరింగ్ వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు కోరింది. శివగంగైకి చెందిన రాజేష్ కుమార్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్‌లో ప్రధాని హాజరు కాకపోయినా ప్రకటనల్లో మాత్రం ఆయన ఫొటోను చూపించాల్సిందేనని కోర్టు పేర్కొంది.

కాగా చెన్నైలో గ్రాండ్ గా ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్ ప్రకటనల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోటో మాత్రమే ఉంచారని  పిటిషన్ దాఖలైంది. అంతర్జాతీయ స్థాయి చెస్‌ పోటీలు జరగటం రాష్ట్రానికి గర్వకారణం, కానీ అధికార పార్టీ (తమిళనాడులో) తమ రాజకీయ లబ్ధి కోసం దీనిని ఒక కార్యక్రమంగా ఉపయోగించుకుందని పిటిషనర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో టిఎన్‌బిజెపి చీఫ్ కె అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. పోస్టర్లు వేయమని పార్టీ తమ కార్యకర్తలకు ఎప్పుడూ సలహా ఇవ్వదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కోర్టు తీర్పు ద్వారా వెలువరించిందన్న ఆయన.. మరోసారి తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోదని, అలాంటి విషయాలను రాజకీయం చేయమని చెప్పారు.