
బాకు (అజర్‌బైజాన్): ప్రతిష్టాత్మక ఫిడే వరల్డ్ కప్‌లో ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్లు ఎరిగైసి అర్జున్, ఆర్. ప్రజ్ఞానంద మధ్య క్వార్టర్ ఫైనల్ హోరాహోరీగా నడుస్తోంది. తొలి గేమ్‌లో ప్రజ్ఞానందకు చెక్ పెట్టిన అర్జున్ రెండో గేమ్‌లో తడబడ్డాడు. బుధవారం జరిగిన రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద 75 ఎత్తుల్లో అర్జున్‌ను ఓడించాడు. దాంతో, ఇద్దరు ప్లేయర్లు ఇప్పుడు ర్యాపిడ్ ట్రైకర్ ఆడనున్నారు. మరోవైపు నార్వే లెజెండ్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో తొలి గేమ్‌లో ఓడిన డి. గుకేశ్ రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నా 0.5-–1.5 తేడాతో ఓడి ఇంటిదారి పట్టాడు. అబసోవ్ నిజత్‌తో రెండో గేమ్‌లో ఓడిన విదిత్ కూడా క్వార్టర్స్‌లోనే పోరు ముగించాడు.