పూజారా ధనా ధన్ ఇన్నింగ్స్

పూజారా ధనా ధన్ ఇన్నింగ్స్

క్రీజులో కుదుర్కొవడానికే బంతులు వేస్ట్ చేసే క్రికెటర్ చిచ్చరపిడుగులా రెచ్చిపోతే..టెస్టు బ్యాట్స్మన్ అని ముద్ర వేసుకున్న వ్యక్తి..ఆకాశమే హద్దుగా చెలరేగితే..అడపాదడపా ఫోర్లు బాదే ఆటగాడు..సిక్సుల వర్షం కురిపిస్తే..ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్కు రెండు కళ్లు చాలవు. కదా..ఇంతకూ ఎవరి గురించి ఈ ఇంటర్ డక్షన్ అనుకుంటున్నారా..? ఇంకెవరి గురించి..మన టెస్ట్ స్పెషలిస్ట్..నయా వాల్ పూజారా గురించే.

టెస్టు ప్లేయర్ అయిన పూజారా..ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు చెలరేగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడుతున్న పూజారా..రాయల్ లండన్ వన్డే కప్లో  ససెక్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే వార్విక్ షైర్తో జరిగిన మ్యాచ్ లో పూజారా..వెరే లెవల్ క్రికెట్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. 

క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పూజారా  ఉగ్రరూపం కనబర్చాడు. కేవలం 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. ఇదోక  విశేషమైతే..పుజారా ఒకే ఓవర్లో 22 పరుగులు రాబట్టం మరో విశేషం. ముందుగా బ్యాటింగ్ వార్విక్ షైర్  టీమ్ 310 పరుగులు చేసింది. టార్గెట్ ఛేజింగ్లో ససెక్స్ .. 112 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో  22వ ఓవర్‌లో పుజారా బ్యాటింగ్‌కు వచ్చాడు. స్టార్టింగ్ నుంచే దాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

యామ్ నార్వెల్ వేసిన 45వ ఓవర్‌లో పుజారా మరింతగా రెచ్చిపోయాడు. అప్పటికే 59 బంతుల్లో 66 పరుగులు చేసిన పూజారా.. ఆ ఓవర్లో వరుసగా 4,2,4,2,6,4 బాదాడు. దీంతో 88 పరుగులకు చేరుకున్నాడు. 48వ ఓవర్‌లో సెంచరీ సాధించాడు.

చివరకు 49వ ఓవర్లో హన్నాన్-డాల్బీ బౌలింగ్ లో ఔటయ్యాడు. పూజారా సూపర్ సెంచరీ చేయడంతో ఆ తర్వాత సస్సెక్స్ టీమ్  బ్యాటర్లను వార్విక్ షైర్ బౌలర్లు కట్టడిచేయడంతో ససెక్స్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.