రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : భీం భరత్

రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : భీం భరత్

చేవెళ్ల,  వెలుగు:  చేవేళ్ల మండలం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన దాదాపు 150  మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌‌‌‌లో  చేరారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎన్ని కుట్రలు పన్నినా..   ఎన్ని అవరోధాలు సృష్టించినా ఎదురొడ్డి  నిలిచామని కాంగ్రెస్ నాయకుడు చేవేళ్ల అభ్యర్థి భీం భరత్ అన్నారు.  ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.  మహిపాల్ రెడ్డి, యాదగిరి గౌడ్, ముకుంద రెడ్డి, రాఘవేందర్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వీరారెడ్డి, కుమార్ గౌడ్, నిరంజన్ గౌడ్, రవీందర్, చింటూ, మల్లారెడ్డి, యాదిరెడ్డి, సంజీవరెడ్డి, నరసింహారెడ్డి, లక్ష్మయ్య, అనిల్, మురళి, చిన్నవీరారెడ్డి, సురేందర్ తదితరులు కాంగ్రెస్‌‌‌‌లో చేరిన వారిలో ఉన్నారు. 

కాంగ్రెస్ నేతల ఇంటింటా ప్రచారం

దొరల తెలంగాణ  నుంచి త్వరలోనే  తెలంగాణకు విముక్తి లభిస్తుందని చేవెళ్ల  గ్రామ సర్పంచ్ బండారు  శైలజరెడ్డి,  పీఎసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌లు దేవర వెంకట్‌‌‌‌రెడ్డి, గోనె ప్రతాప్‌‌‌‌రెడ్డి అన్నారు.  సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద, కుమ్మెర, రామన్నగూడ  తదితర గ్రామాల్లోని పలు కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గడపగడపన ప్రచారం నిర్వహించారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేన భీం భరత్‌‌‌‌ను గెలిపించాలని కోరారు.  ఈ సందర్భంగా జరిగిన  కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు.  

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వమేనని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశ పెట్టిన 6  గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు.  కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి,  పడాల రాములు, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్‌‌‌‌రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు  మధుసూదన్‌‌‌‌గుప్తా, మాజీ సర్పంచ్‌‌‌‌లు దవల్ గారి గోపాల్ రెడ్డి, పడాల ప్రభాకర్‌‌‌‌, నర్సింలు, మాజీ ఎంపీటీసీ నరసింహరెడ్డి, పెంటయ్య గౌడ్, చేవెళ్ల ఉప సర్పంచ్‌‌‌‌ యాదయ్య, మాజీ ఉప సర్పంచ్‌‌‌‌ టేకులపల్లి శ్రీనివాస్‌‌‌‌, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గుడుపల్లి పెంటారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌  శ్రీకాంత్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సమతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.