చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం

వికారాబాద్, వెలుగు : చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బుధవారం బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. పూడూరు మండలం మన్నెగూడ వద్ద బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట జడ్పీ హై స్కూల్ లో

బుధవారం బడిబాటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డితో కలిసి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం యాలాలలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.