కమాండర్ ను కాల్చిన కానిస్టేబుల్

కమాండర్ ను కాల్చిన కానిస్టేబుల్

జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో భద్రతా బలగాల కమాండర్ ను కానిస్టేబుల్ కాల్చి చంపాడు. కమాండర్ రామ్ ఖురేపై ఇవాళ ఉదయం కానిస్టేబుల్ విక్రమ్ రాజ్వారే కాల్పులు జరిపారు. కమాండర్ ను కాల్చి చంపి తర్వాత కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్నికల విధుల కోసం జార్ఖండ్ వెళ్లిన ఛత్తీస్ గఢ్ బలగాల బృందంలో కాల్పులు జరిగాయి.

విక్రమ్ ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.