రిజర్వేషన్లను 76 శాతానికి పెంచిన ఛత్తీస్‌గఢ్‌

రిజర్వేషన్లను 76 శాతానికి  పెంచిన ఛత్తీస్‌గఢ్‌

ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి పెంచింది. ఈ మేరకు శాస‌న‌స‌భ‌లో రెండు బిల్లుల‌ను ఆమోదించింది. స్పీకర్ నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలంతా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి..ఈ సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరాలని విజ్ఞప్తి చేశారు.

ఈ బిల్లుల ప్రకారం షెడ్యూల్ తెగలకు 32 శాతం, ఇతర వెనకబడిన కులాలకు 27 శాతం, షెడ్యూల్‌ కులాలకు 13 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. మరో 4 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. ఇంత భారీ ఎత్తున రిజర్వేషన్లను పెంచడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున సాహ‌సం చేయ‌లేదు. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లను పెంచినట్లుగా సీఎం భూపేశ్ బఘేల్ వెల్లడించారు.