ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్..29కి పెరిగిన మృతుల సంఖ్య..మృతుల్లో కీలక నేత

ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్..29కి పెరిగిన మృతుల సంఖ్య..మృతుల్లో కీలక నేత

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛోటేబేథియా PS పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 29 మంది మావోయిస్టులు అక్కడికక్కడే చనిపోయారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డవారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు BSF సిబ్బంది. ఇప్పటికే కొందరి మావోయిస్టుల డెడ్బాడీలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగారు.

ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్, డిస్ట్రిక్ట్  రిజర్వ్ గార్డ్ బలగాలు అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా..ఎన్ కౌంటర్  మొదలైంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్ రావు కూడా ఉన్నాడని తెలిపారు పోలీస్ ఆఫీసర్లు. అతని 25 లక్షల రివార్డు కూడా ఉందన్నారు. 

భారీ ఎన్ కౌంటర్ పై స్పందించారు ఛత్తీగఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. రాబోయే కాలంలో నక్సల్స్ రహిత బస్తర్ కోసం అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. ఏమైనా ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలన్నారు. బస్తర్ లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమన్నారు విజయ్ శర్మ.