ప్రభుత్వం పట్టించుకోలేదు: ప్రజలే కట్టెలతో బ్రిడ్జి కట్టుకున్నారు

ప్రభుత్వం పట్టించుకోలేదు: ప్రజలే కట్టెలతో బ్రిడ్జి కట్టుకున్నారు

చత్తీస్ గడ్ : భారీ వర్షాలకు ఉత్తర భారతం వనుకుతుంది. చాలా ప్రాంతాలలో వరద నీరు వచ్చిచేరుతుంది. ఇందులో భాగంగా… చత్తీస్ గడ్ లోపడిన వర్షానికి ఆరాష్ట్రంలోని చాలాప్రాంతాలకు కనెక్టివిటీ కోల్పోయింది. రోడ్డుమార్గంలో పూర్తిగా నీళ్లు వచ్చి చేరాయి. పిప్ రహి, బల్ రామ్ పూర్ అనే రెండు ఊర్లలో రోడ్డుమార్గం పూర్తిగా నీళ్లతో మునగడంతో.. అక్కడి ప్రజలు హాస్పిటల్ కు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అదే వరద నీటిపై కట్టెలతో చిన్నగా బ్రిడ్జ్ ను కట్టుకున్నారు. ఇది దాదాపు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పొడవు ఉంది. స్థానిక ప్రజలను మీడియా  పలకరించగా… తమ ఊరికి ఆంబులెన్స్ రావడానికి రోడ్డుమార్గం నీళ్లతోనిండి పోయిందని..  ఆరోగ్యం బాగాలేని వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి కట్టెలతో బ్రిడ్జ్ కట్టుకున్నమని చెప్పారు.