
ఛత్తీస్‌గడ్ మాజీ సీఎం అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చారు. అజిత్ జోగి గత వారంలో రెండుసార్లు గుండెపోటుకు గురయ్యారు. దాదాపు మూడు వారాలుగా అజిత్ జోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఛత్తీస్‌గడ్ ప్రత్యేక రాష్ట్రం 2000 సంవత్సరంలో ఏర్పడింది. ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి పనిచేశారు. అజిత్ జోగి 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గడ్ పార్టీని ఏర్పాటు చేశారు.
అజిత్ జోగి మరణాన్ని ధృవీకరిస్తూ.. ఆయన కొడుకు అమిత్ జోగి తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ‘20 ఏళ్ల ఛత్తీస్‌గడ్ ఒక మూలపురుషున్ని కోల్పోయింది. నేను మాత్రమే కాదు ఛత్తీస్‌గడ్ కూడా తండ్రిని కోల్పోయింది’ అని ట్వీట్ చేశారు.
For More News..