గో మూత్రం కొననున్న ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం

గో మూత్రం కొననున్న ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం

హిందువులు ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తారు. దాని నుంచి వచ్చిన మూత్రం, పేడను కూడా చాలా మంది ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. ఏదైనా శుభకార్యాలలోనూ గోమూత్రాన్ని సంప్రదాయబద్ధంగా వాడుతారు. ఇంట్లో చల్లితే నెగెటివ్ ఎనర్జీ పోతుందని కూడా చాలా మంది విశ్వసిస్తారు. వీటితో పాటు పలు సేంద్రీయ ఎరువుల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గోధన్ న్యాయ్ యోజన పథకం కింద  పశువుల పేడను సేకరిస్తుండగా.. తాజాగా గోమూత్రాన్ని కూడా కొననున్నట్టు ప్రకటించింది. మరో వారం రోజుల్లో ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుందని వెల్లడించింది. పైలట్ ప్రాజెక్టుగా కొనుగోళ్లను ప్రారంభిస్తామన్న ప్రభుత్వం.. దీని కోసం ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన గోధన్ న్యాయ్  కింద పశువుల పేడను రూ.2చొప్పును కొనుగోలు చేస్తుండగా... తాజా ప్రకటన ప్రకారం గోమూత్రాన్ని లీటరు ధర రూ. 4 గా నిర్ణయించింది. గోమూత్రాన్ని గ్రామ గోఠాన్‌ సమితి ద్వారా సేకరిస్తామని సీఎం ముఖ్య సలహాదారు ప్రదీప్ శర్మ  చెప్పారు.